నెల్లూరులో స్టీల్స్ అండ్ సిమెంట్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం జరిగింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్టీల్స్ అండ్ సిమెంట్ వ్యాపారుల సమస్యల పరిష్కారానికి... ఈ సంఘం ఏర్పాటు చేసినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జున్ తెలిపారు. సిమెంట్‌పై 28శాతం ఉన్న జీఎస్టీని తగ్గించాలని, ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ద్వారా సమస్యను పరిష్కరించేందుకు తనవంతు కృషిచేస్తానని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ హామీఇచ్చారు.
నెల్లూరులో ఎస్సీఎస్డీఏ ఆత్మీయ సమావేశం
నెల్లూరులో ఎస్సీఎస్డీఏ వారి ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ హాజరయ్యారు.
నెల్లూరులో ఎస్సీఎస్డీఏ ఆత్మీయ సమావేశం