ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యార్థులకు కరోనా... ఆందోళనలో తల్లిదండ్రులు

పాఠశాలలపై కరోనా పంజా విసురుతోంది. నెల్లూరులో 14 మంది విద్యార్థినులకు.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడుగురు పదో తరగతి విద్యార్థులకు వైరస్ సోకినట్లు నిర్థరణ అయ్యింది.

corona
విద్యార్థులకు కరోనా

By

Published : Apr 26, 2021, 2:15 PM IST

నెల్లూరు జిల్లాలో...

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లి బాలయోగి గురుకులంలో కొవిడ్ పంజా విసిరింది. 73 మంది విద్యార్థినులకు పరీక్షలు చేయగా.. 14 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది.

పశ్చిమ గోదావరి జిల్లాలో...

పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం జడ్పీ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపింది. పదో తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. 25 మందికి విద్యార్థులకు పరీక్షలు చేయగా.. ఏడుగురికి నిర్థరణ య్యింది.

తమ పిల్లలు వైరస్ బారిన పడటం పట్ల.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో విషాదం.. ఇద్దరు కొవిడ్ రోగులు మృతి

ABOUT THE AUTHOR

...view details