ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శానిటైజర్ తాగి ఎంఎన్​వో ఆత్మహత్యాయత్నం

ఆర్నెల్లుగా వేతనాలు లేక కుటుంబం ఇబ్బంది పడుతోందంటూ.. నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఎంఎన్​వో ప్రేమ్ కుమార్ ఆత్మహత్యకు యత్నించాడు. శానిటైజర్ తాగిన బాధితుడికి చికిత్స అందించగా.. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తెదేపా నేత అబ్దుల్ అజీజ్ పరామర్శించారు.

By

Published : Jan 19, 2021, 7:16 PM IST

mno suicide attempt at nellore district hospital
నెల్లూరు జిల్లా ఆస్పత్రి వద్ద ఎంఎన్​వో ఆత్మహత్యాయత్నం

నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఎంఎన్​వో ప్రేమ్ కుమార్ శానిటైజర్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అపస్మారకస్థితిలో ఉన్న అతడికి వైద్యులు చికిత్స అందించారు. ఆర్నెల్లుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. కుటుంబ పోషణ కష్టంగా మారడంతో ఆత్మహత్యకు ప్రయత్నించానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

నెల్లూరు జిల్లా ఆస్పత్రి వద్ద ఎంఎన్​వో ఆత్మహత్యాయత్నం

చికిత్స పొందుతున్న బాధితుడిని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి, తెదేపా నేత అబ్దుల్ అజీజ్ పరామర్శించారు. బకాయి వేతనాలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సర్దిచెప్పగా.. ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ తెదేపా నేతలు ధర్నా చేపట్టారు. వేతనాలు అందక పూట గడవడమే కష్టంగా మారిన తమను ఆదుకోవాలని వైద్య సిబ్బంది కోరుతున్నారు.

ఇదీ చదవండి:'వార్తల్లో నిలవడం కోసమే ఎస్పీని తిట్టారు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details