మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పొదుపు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పసుపు కుంకుమ కింద నిధులు అందజేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న చంద్రబాబుకు రానున్న ఎన్నికలలో ఘన విజయం చేకూర్చాలన్నారు.
'చంద్రబాబును గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉంది'
మహిళల అర్ధికాభివృద్ధికి తెదేపా ప్రభుత్వం కృషి చేస్తోంది. పొదుపు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం చంద్రబాబు పసుపు-కుంకుమ కింద నిధులు అందిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తోన్న చంద్రబాబును మరోసారి గెలుపించుకునే బాధ్యత మనందరిపై ఉంది.- నారాయణ, మున్సిపల్ శాఖామంత్రి
మంత్రి నారాయణ
TAGGED:
నారాయణ