సమగ్ర ప్రణాళికతో నెల్లూరు నగరాభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. నగరంలోని భక్తవత్సలనగర్ దగ్గర 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రోడ్డును రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. రానున్న రోజుల్లో నెల్లూరు నగరంతోపాటు రూరల్ ప్రాంతాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి ప్రకటించారు. ఫ్లైఓవర్‌తో పాటు, కాలువల నిర్మాణాలు చేపడతామన్నారు.
నెల్లూరు నగరాభివృద్ధికి చర్యలు చేపడతాం: మంత్రి అనిల్
నెల్లూరులో రూ. 2 కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్డును మంత్రి అనిల్ కుమార్ ప్రారంభించారు. నగర అభివృద్ధికి చర్యలు చేపడతామని తెలిపారు.
రోడ్డును ప్రారంభించిన మంత్రి అనిల్