ఆనందయ్య మందు పేరిట నకిలీ ఔషధాన్ని విక్రయించిన ఓ వ్యక్తిని ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ మందును స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌కు చెందిన మానవ హక్కుల సంఘం ప్రతినిధులు ఆనందయ్య మందు కావాలంటూ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన సురేష్ అనే వ్యక్తిని సంప్రదించారు. ఆనందయ్య శిష్యుడిగా చెప్పుకుంటున్న సురేష్ అనే యువకుడు 10 కిలోల మందు లక్షా 20వేల రూపాయలకు బేరం పెట్టాడు.