ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల తీరు మారాలి: అనిల్​కుమార్

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల తీరు మారాలని మంత్రి అనిల్​కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైద్యులతో మంత్రి సమావేశం నిర్వహించారు.

అనిల్​కుమార్ యాదవ్

By

Published : Jul 20, 2019, 11:22 PM IST

అనిల్​కుమార్ యాదవ్

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు వైద్యులు కృషి చేయాలని జలవనరుల శాఖ మంత్రి అనిల్​కుమార్ యాదవ్ కోరారు. నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైద్యులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలున్నా... అందుకు తగ్గ వైద్య సేవలు అందకపోవడానికి కారణమేమిటని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి చిన్న ప్రమాదాలకు చికిత్స చేసేందుకే అన్నట్లు తయారైందన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే వైద్యుల ధోరణి మారాలని సూచించారు. ప్రభుత్వం ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details