'అమ్మ ఒడి' రెండో విడతకు నెల్లూరు వేదికగా మారింది. నగరానికి ముఖ్యమంత్రి వస్తుండటంతో... ముమ్మర ఏర్పాట్లు చేశారు. సీఎం జగన్.... తాడేపల్లి నుంచి బయలుదేరి..... ఉదయం 11 గంటల 10నిమిషాలకు... నెల్లూరులోని పోలీస్ పరేడ్ మైదానానికి చేరుకుంటారు. అక్కడ స్టాల్స్‌ను పరిశీలించాక.... పదకొండున్నరకు బహిరంగ సభకు హాజరై... అమ్మఒడి రెండో విడతను ప్రారంభిస్తారు. కంప్యూటర్ బటన్ నొక్కి..... దాదాపు 44 లక్షల 48 వేల 865 మంది తల్లుల ఖాతాల్లో 6 వేల 673 కోట్లు నగదు జమ చేస్తారు.
తల్లుల ఖాతాల్లోకి నేడు 'అమ్మఒడి'
'అమ్మఒడి' పథకం రెండో విడత కింద లబ్ధిదారుల ఖాతాల్లో నేడు సీఎం జగన్ నగదు జమ చేయనున్నారు. నెల్లూరులోని వేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో జరగనున్న ఈ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. 44 లక్షల 48 వేల 865 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో.... 6 వేల 673 కోట్లు జమ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
తల్లుల ఖాతాల్లోకి నేడు 'అమ్మఒడి'
ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకూ 'అమ్మఒడి' పథకం కింద ఏటా 15 వేల రూపాయలు జమ చేస్తున్నట్లు తెలిపిన ప్రభుత్వం...... మరింతమందికి ప్రయోజనం కలిగేలా ఈసారి నిబంధనలు సడలించినట్లు వెల్లడించింది. ఎన్నికల నియమావళికి లోబడే అమ్మఒడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు. కార్యక్రమం అనంతరం.... మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్..... తిరిగి తాడేపల్లికి చేరుకుంటారని అధికారులు వెల్లడించారు.
ఇదీచదవండి.