Suicide Attempt: నెల్లూరు జిల్లా బిట్రగుంట రైల్వేస్టేషన్లో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. విద్యుత్ తీగలను పట్టుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించారు. కండీర్ (34) కేరళ నుంచి ఝార్ఖండ్‌కు వెళ్తున్నాడు. కానీ తను వెళ్లాల్సిన గమ్యం రాకముందే.. బిట్రగుంట రైల్వే స్టేషన్లో దిగాడు. ఆత్మహత్య చేసుకుంటానని కొద్దిసేపు హంగామా చేశాడు. ఎంతమంది ఆపినా వినకుండా... విద్యుత్ స్తంభం ఎక్కి కరెంట్ తీగలను పట్టుకున్నాడు. అంతే షాక్ తగిలి కిందపడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, ఘటనాస్థలానికి చేరుకుని 108 వాహనంలో కావలి వైద్యశాలకు తరలించారు.
బిట్రగుంట రైల్వేస్టేషన్లో వ్యక్తి హల్చల్.. భార్య విడిచి వెళ్లిందని.. - bitragunta railway station
Suicide Attempt : కేరళ నుంచి ఝార్ఖండ్ వెళ్లాల్సిన వ్యక్తి బిట్రగుంట రైల్వే స్టేషన్లో దిగాడు. తన భార్య తనను వదిలి వెళ్లిపోయిందంటూ కొద్దిసేపు హంగామా చేశాడు. భార్య ఇక రాదేమోనని మనస్థాపానికి గురైన అతను.. రైల్వే కరెంట్ స్తంభం ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకొని అత్మహత్యాయత్నం చేశాడు.
కరెంట్ తీగలను పట్టుకొని అత్మహత్య
కండీర్ది ఝార్ఖండ్ రాష్ట్రంగా రైల్వే పోలీసులు పేర్కొన్నారు. భార్యతో గొడవపడటంతో.. ఆమె అతడిని విడిచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మనస్థాపంతో కండీర్ ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఇవీ చదవండి: