Venus colony park in kurnool : ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తున్న ఈ పార్కు... కర్నూలు నగరంలోని వీనస్ కాలనీలో ఉంది. చుట్టూ పచ్చని చెట్లతోపాటు వ్యాయామానికి అవసరమైన వాకింగ్ ట్రాక్, చిన్నారులకు ప్రత్యేకంగా ఆటవస్తువులు, వృద్ధులు సేదతీరేలా బల్లలు ఏర్పాటు చేశారు. అర్థాంతరంగా ఆగిపోయిన పార్కును కాలనీవాసులు చందాలు పోగుచేసిన సొమ్ముతోపాటు అమృత్ పథకం, నగరపాలక సాధారణ నిధి కింద రూ.48 లక్షలు వెచ్చించి పూర్తిస్థాయిలో ఉద్యానవనాన్ని అభివృద్ధి చేశారు.
పంచతత్వ ఏర్పాటు...
ఈ ఉద్యానవనంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రూ.8 లక్షల రూపాయలతో పంచతత్వ ఏర్పాటు చేశారు. ఇక్కడ నడవడం ద్వారా కాళ్లల్లో రక్తప్రసరణ బాగా పెరిగి అనేక వ్యాధులు దూరమవుతాయన్నారు. ఉదయం ఎంతో స్వచ్ఛమైన గాలి విడుదలవుతుందని వివరించారు.