ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KARTHIKA MASAM: శైవ క్షేత్రాల్లో కార్తీకమాస ప్రత్యేక పూజలు, దీపారాధనలు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా లక్ష బిల్వ, కుంకుమార్చన పూజలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు డిసెంబర్ 2 వరకు జరుగుతాయని ఈవో తెలిపారు. శ్రీశైల మహాక్షేత్రంలో మూడో సోమవారం వైభవంగా లక్ష దీపోత్సవం జరిగింది.

శైవ క్షేత్రాల్లో కార్తీకమాస ప్రత్యేక పూజలు, దీపారాధనలు
శైవ క్షేత్రాల్లో కార్తీకమాస ప్రత్యేక పూజలు, దీపారాధనలు

By

Published : Nov 23, 2021, 12:46 PM IST

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా లక్ష బిల్వ, కుంకుమార్చన పూజలు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో(SRIKALAHASTI TEMPLE) ఘనంగా లక్ష బిల్వ, కుంకుమార్చన పూజలు ప్రారంభమయ్యాయి. ఆలయంలోని అలంకార మండపంలో సోమస్కంద మూర్తి సమేత శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవిలకు వేదపండితులు మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన బిల్వ, కుంకుమ అభిషేకాలను నిర్వహించారు. డిసెంబర్ 2 వరకు ఈ పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలియజేశారు.

శ్రీశైల మహాక్షేత్రంలో(KARTHIKA MASAM AT SRISAILAM TEMPLE) కార్తీకమాసం మూడో సోమవారం వైభవంగా లక్ష దీపోత్సవం జరిగింది. శ్రీస్వామి అమ్మ వార్ల ఉత్సవమూర్తులను దేవస్థానం ఈవో లవన్న, అర్చకులు, వేదపండితులు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. స్వామిఅమ్మ వార్లకు వేదమంత్రోచ్ఛరణలతో విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా దశ విధ హారతులను దేవదేవులకు సమర్పించారు. భక్తులు లక్ష దీపోత్సవంలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక దీపోత్సవ శోభతో శ్రీగిరి సన్నిధి దేదీప్యమానంగా వెలిగిపోయింది.

ఇదీ చదవండి:Ntr Trust: వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్టు సాయం

ABOUT THE AUTHOR

...view details