ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వేర్వేరు ప్రాంతాల్లో.. ఈతకు వెళ్లి ఏడుగురు మృతి

Seven people dead: ఎండలు మండుతున్నాయి.. వేసవిని తట్టుకోలేక కొందరు.. సెలవుల్లో సరదాగా వాగులు, వంకల్లో ఈతకు వెళ్లిన మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఘటనలు వారి కుటుంబాల్లో విషాదం నింపుతోంది. రాష్ట్రంలో ఒకేరోజు వేర్వేరు ప్రాంతాల్లో నీటి మునిగి ఏడుగురు మృతి చెందారు.

Seven people dead
ఏడుగురు మృతి

By

Published : May 17, 2022, 8:37 PM IST


కర్నూలు జిల్లాఆదోని పట్టణం చౌదరి బావిలో ఈతకు వెళ్లి 13 ఏళ్ల మొహ్మద్ బావిలో పడి మృతి చెందాడు. పట్టణంలోని నిజాముద్దీన్ కాల్​లో ఉన్న చౌదరి బావిలో వేసవి సెలవులు నేపథ్యంలో భారీ ఎత్తున పిల్లలు ఈత కొడుతున్నారు. ఈ క్రమంలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మునిగిపోయాడు. రెండు గంటల తరువాత స్థానికులు బాలుడిని బావి నుంచి వెలికి తీశారు. అనంతరం హుటాహుటిన ఆదోని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు వెల్లడించారు.

బాపట్ల జిల్లాలో నిన్న సముద్రస్నానానికి దిగి గల్లంతైన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతదేహాలు.. వేటపాలెం మండలం రామాపురం తీరానికి కొట్టుకొచ్చాయి. మృతులు దుర్గాభవాని, సయ్యద్ జిలానీగా పోలీసులు గుర్తించారు.

వైఎస్‌ఆర్‌ జిల్లా:ఖాజీపేట మండలంలోని ఆంజనేయకొట్టాలు వద్ద వక్కిలేరు వంకలో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు. పొలానికి వెళ్లేందుకు వంక దాటుతుండగా నీట మునిగి బాలురు ప్రాణాలు కోల్పోయారు.

అనకాపల్లి జిల్లా: అనంతగిరి మండలం సరియా జలపాతంలో ఇద్దరు స్నేహితులు గల్లంతయ్యారు. విశాఖ ఎల్లమ్మతోటకు చెందిన దుక్క సాయి (30), చైతన్య (17) అనే ఇద్దరు గల్లంతవ్వగా... మరో ఇద్దరు మిత్రులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details