Registration papers issue: కర్నూలు జిల్లా గూడూరు మండలం చనుగొండ్లలో రిజిస్ట్రేషన్ పత్రం ఇచ్చేందుకు సచివాలయ ఉద్యోగులు అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఓటీఎస్ లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఓటీఎస్ సొమ్ము చెల్లించినప్పటికీ.. అదనంగా 2వేల రూపాయలిస్తేనే రిజిస్ట్రేషన్ పత్రం ఇస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఓటీఎస్ సొమ్ము చెల్లించడమే.. ఇబ్బందిగా ఉన్న సమయంలో అదనంగా 2 వేల రూపాయలను ఎలా చెల్లించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ పత్రం కోసం సచివాలయం చుట్టూ ఎంత తిరిగినా.. డబ్బులిస్తేనే పని జరుగుతుందని అంటున్నారని ఆరోపిస్తున్నారు.