రాయలసీమ జిల్లాలో ఏకధాటిగా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు జలకళ సంతరించుకున్నాయి. కరవు జిల్లా అనంతపురంలో కురిసిన వర్షానికి చెరువుల్లోకి నీరు చేరింది. గుడిబండ మండలంలోని పలు గ్రామాల్లో వాగులు నిండుగా ప్రవహించాయి. కరవు నేలలోకి నీరు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా హొళగుంద, హాలహర్వి మండలాల్లో కురిసిన వర్షాలకు... రహదారుల మీద నీరు చేరింది. నిర్మాణంలో ఉన్న ఓకల్వర్టు ప్రవాహానికి కొట్టుకుపోయింది. హొళగుంద, ఆదోని మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బళ్లారి-కర్నూలు రహదారి కోతకు గురై ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాలహర్వి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి వర్షం నీరు చేరి సిబ్బంది అవస్థలు పడుతున్నారు.
రాయలసీమలో వర్షాలు-రైతుల్లో ఆనందం - రాయలసీమలో వర్షాలు
రాయలసీమ జిల్లాల్లో వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల రహదారులు కోతకు గురైయ్యాయి.దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
rain-in-rayalaseema