రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కర్నూలు మాజీ ఎంపీపీ, తెలుగుదేశం నేత రాజవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు. రాజవర్ధన్ రెడ్డి తండ్రి విష్ణువర్ధన్ రెడ్డిని ఓదార్చిన లోకేశ్.. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. అంతకుముందు.. చిత్రపటానికి లోకేశ్ నివాళులు అర్పించారు. గతనెల 20న రాజవర్ధన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.
రాజవర్ధన్ రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది: లోకేశ్
తెలుగుదేశం నేత రాజవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని నారా లోకేశ్ పరామర్శించారు. పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
"రాజ్ వర్ధన్‌రెడ్డి ముందు నా స్నేహితుడు...ఆ తర్వాతనే రాజకీయాలు. రాజకీయ కుటుంబంలో పుట్టి పెరిగినా.. ఒక ఐటీ ప్రొఫెషనల్‌గా ఉన్నత స్థాయికి ఎదిగి పదేళ్లు బాగా కష్టపడి.. తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. కర్నూలు రూరల్ ఎంపీపీగా పోటీ చేసి గెలుపొందారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు రాజ్వర్ధన్రెడ్డి నన్ను కలిసినా.. ఏనాడు వ్యక్తిగత పనులు, కాంట్రాక్టుల గురించి మాట్లాడలేదు. చాలా చిన్న వయసులోనే కన్నుమూశారు. రాజవర్ధన్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను." - నారా లోకేశ్
ఇదీ చదవండి: కార్మికులను గౌరవించే సంస్కారం సీఎం జగన్‌కు లేదు: అచ్చెన్న