ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ROAD ACCIDENTS: మూడు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు.. 8మంది మృతి

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో.. 8మంది మృతి చెందగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఆయా ప్రమాదాలపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు.. రోడ్డుపై ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

road accidents
రోడ్డు ప్రమాదాలు

By

Published : Jun 25, 2021, 9:59 PM IST

కర్నూలు, విశాఖ, ప్రకాశం జిల్లాల్లో రహదారులు రక్తమోడాయి. ఆయా ప్రాంతాల్లో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో.. మొత్తం 8మంది మరణించారు, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

కర్నూలు జిల్లాలో..

ఓర్వకల్లు సమీపంలో కర్నూలు నుంచి నంద్యాల వైపు వెళుతున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈప్రమాదంలో రుబినా, సహనా అనే ఇద్దరు అక్కాచెల్లెలు మృతిచెందారు. బైక్​ నడుపుతున్న ఇజాజ్​కు గాయాలు అయ్యాయి. ఇజాజ్ కర్నూలు విజయ నగర్​కాలనీ వాసి కాగా.. మృతులిద్దరూ పాతబస్తీకి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

ప్రకాశం జిల్లాలో..

త్రిపురాంతకం మండలంలోని వెల్లంపల్లి గ్రామ సమీపంలో గుంటూరు - కర్నూలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. త్రిపురాంతకం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం ముందున్న వాహనాన్ని అధిగమిస్తూ.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. బైక్​పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిని యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మృతి చెందిన కుటుంబాలను న్యాయం చేయాలని యర్రగొండపాలెం ప్రధాన రహదారిపై బైఠాయించి వారి బంధువులు ఆందోళన చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని సముదాయించి ఆందోళన విరమింపజేశారు.

విశాఖ జిల్లాలో..

కొయ్యూరు మండలం శరభన్నపాలెం సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. శరణ్య పాలెం నుంచి నర్సీపట్నం వైపు వస్తున్న సిగ్గే చిన్నారావు, నర్సీపట్నం నుంచి కొయ్యూరు వెళ్తున్న వంతల సూర్యనారాయణ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వస్తూ బలంగా ఢీకొన్నాయి. ఇందులో చిన్నారావు అక్కడికక్కడే మృతి చెందగా సూర్యనారాయణతో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరిని చికిత్స కోసం నర్సీపట్నం తరలించినట్టు స్థానికులు చెబుతున్నారు.

ఇదీ చదవండీ.. Humanity: తప్పిపోయిన తల్లి..కుమారుల వద్దకు చేర్చిన ఛత్తీస్​గఢ్ పోలీసులు

ABOUT THE AUTHOR

...view details