దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడిపై సెక్యూరిటీ గార్డ్ కర్రతో చితక బాదిన ఘటన కర్నూల్ జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో జరిగింది. సదరు భక్తుడు ఆలయం మూసే సమయానికి వచ్చారు. దర్శనం చేసుకోవాలని వెళ్తుండగా సెక్యూరిటీ గార్డ్ అడ్డగించటంతో భక్తుడు వాదించారు. లోనికి వెళ్లేందుకు సెక్యూరిటీ సిబ్బంది ససేమిరా అన్నారు. కొంతసేపు వాగ్వావాదం చోటుచేసుకుంది. ఆగ్రహించిన సెక్యూరిటీ అక్కడే ఉన్న కర్రలతో భక్తుడిని కొట్టి తరిమి వేశాడు. తనపై ముగ్గురు సిబ్బంది దాడి చేశారంటూ భక్తుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
Mantralayam: భక్తుడిపై సెక్యూరిటీ గార్డ్ దాడి
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠానికి దర్శానానికి వచ్చిన ఓ భక్తుడిపై సెక్యూరిటీ గార్డ్ చేయి చేసుకున్నాడు. ఆలయం సమయం ముగిశాక .. సదరు భక్తుడు గుడిలోకి వెళ్లే క్రమంలో వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన సెక్యూరిటీ గార్డ్.. భక్తుడిని కర్రతో కొట్టాడు.
భక్తుడిపై సెక్యూరిటీ గార్డ్ దాడి