'ఆరోపణలు నిజమైతే.. నడిరోడ్డులో ఉరితియ్యండి' - Kurnool mla Hafiz Khan latest press meet
తాను తప్పు చేసినట్లు రుజువు చేస్తే కర్నూలు రాజ్ విహర్ సెంటర్లో ఉరి వేయమని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తెదేపా నాయకులకు సవాల్ విసిరారు. తన వల్లే కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని విమర్శించే వారిపై ఆయన మండిపడ్డారు.
తన వల్లే కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని విమర్శించేవారు.. ఆ ఆరోపణలు రుజువు చెయ్యాలని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తెదేపా నాయకులకు సవాల్ విసిరారు. తాను తప్పు చేసినట్లు రుజువు చేస్తే కర్నూలు రాజ్ విహర్ సెంటర్లో ఉరి తీయమని వ్యాఖ్యానించారు. తనపై వస్తున్న విమర్శలకు ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా సమయంలో తెదేపా నాయకులు ఇంటికే పరిమితం అయితే వైకాపా నేతలు ప్రజా సేవలో ఉన్నారని తెలిపారు. మాజీమంత్రి భూమా అఖిల ప్రియ తనను విమర్శించడం సరికాదన్నారు.