కర్నూలు జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. పాఠశాలల్లో...కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే పాఠశాలల్లో.. 83 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వీరిలో 69 మంది విద్యార్థులు కాగా..14 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాలలు ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 720 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి కరోనా సోకింది. అత్యధికంగా కస్తూర్భా, మోడల్ స్కూళ్లలో కేసులు నమోదవుతుండటం కలవరానికి గురి చేస్తోంది.
పాఠశాలల్లో కరోనా కలకలం.. ఇవాళ 83 కొత్త కేసులు - కర్నూలు పాఠశాలల్లో కరోనా కేసులు
కర్నూలు జిల్లాలోని పాఠశాలల్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 83 మందికి వైరస్ సోకినట్లు జిల్లా వైద్యశాఖ అధికారులు తెలిపారు.
పాఠశాలల్లో కరోనా కలకలం