అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్లకు నంద్యాల ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వీరిని నంద్యాల నుంచి కర్నూలు సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులో అరెస్టయిన వీరికి నవంబర్ 9న బెయిల్ మంజూరైంది. బెయిల్ రద్దు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన మూడో అదనపు జిల్లా కోర్టు బెయిల్ రద్దు చేసింది. డిసెంబర్ 2 వతేదీ 5 గంటలలోపు హాజరు కావాలని ఆదేశించింది. ఇవాళ కోర్టులో హాజరైన సీఐ, హెడ్ కానిస్టేబుల్కి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
అబ్దుల్ సలాం కేసులో సీఐ, హెడ్ కానిస్టేబుల్కు 14 రోజులు రిమాండ్ - CI, constable remanded for 14 days in Nandyal Abdul Salam suicide case
ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కేసులో నంద్యాల ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్లకు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
అబ్దుల్ సలాం కేసులో సీఐ, హెడ్ కానిస్టేబుల్కు 14 రోజులు రిమాండ్అబ్దుల్ సలాం కేసులో సీఐ, హెడ్ కానిస్టేబుల్కు 14 రోజులు రిమాండ్
Last Updated : Dec 3, 2020, 7:57 AM IST