ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సీనియర్ వైద్యులకు పదోన్నతుల్లో అన్యాయం జరుగుతోంది'

కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద బీసీ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో సీనియర్ వైద్యులకు పదోన్నతుల్లో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఈ విషయంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

bc leaders dharna
బీసీ సంఘం నాయకుల ధర్నా

By

Published : Dec 7, 2020, 5:31 PM IST

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో సీనియర్ వైద్యులకు పదోన్నతుల్లో అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ.. బీసీ సంఘం నాయకులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఆసుపత్రిలో ఒక వర్గం వైద్యుల అధిపత్యం ఎక్కువగా ఉందని.. వారికే పదవులు వస్తున్నాయని వారు అన్నారు. కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపాల్​​గా ఉన్న డాక్టర్ చంద్రశేఖర్​ను ఓ విభాగానికి అధిపతిని చేస్తూ బదిలీ చెయ్యడం ఏంటని ప్రశ్నించారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details