బైక్పై ఉన్న వ్యక్తీ చనిపోయాడు: కర్నూలు కలెక్టర్
వెల్దుర్తి ప్రమాద క్షతగాత్రులను కర్నూలు సర్వజన ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మృతుల బంధువుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. వారి రోదనతో ఆసుపత్రిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిశ్చితార్ధం ఖాయమైన సంతోషంతో ఉన్న వారంతా.. ఒక్కసారిగా విగతజీవులుగా మారిన భయానక పరిస్థితుల్లో బాధితులు ఇంకా షాక్ లోనే ఉన్నారు.
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలవ్వగా ...వాారిని కర్నూలు సర్వజన వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు శాయశక్తులా కృషి చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. వాహన వేగాన్ని అదుపులో ఉంచుకుని... ట్రాఫిక్ రూల్స్ పాటించినప్పుడే ప్రమాదాలు నివారించగలుగుతామన్నారు. ద్వి చక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో బస్సు...తూఫాను వాహనాన్ని ఢీకొట్టిందన్నారు. ద్వి చక్ర వాహనంపై ఉన్న వ్యక్తి సైతం ఈ ప్రమాదంలో మృతి చెందాడని కలెక్టర్ చెప్పారు. రోడ్డు ప్రమాదాలపై ప్రయాణికుల్లో అవగాహన రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.