సామాన్యులకు వ్యాక్సిన్ అందే పరిస్థితి లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వ్యాక్సిన్ల కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ తయారీ సంస్థలకూ కులం ఆపాదిస్తారా అని ప్రశ్నించారు.
ఆక్సిజన్ కొరతతో ప్రజల ప్రాణాలు పోతుంటే పట్టదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. సరిహద్దు వద్ద అంబులెన్సులను ఆపుతున్నా వైకాపా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు అంబులెన్సులు పంపలేని స్థితిలో పాలకులు ఉన్నారని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.