గోదావరి డెల్టాలోని ఖరీఫ్ పంటలకు సీలేరు నీరు
గోదావరిలో నీరు లేక నదీ పరివాహక ప్రాంతాల్లో పంటల దిగుబడి ప్రశ్నార్థకంగా మారింది. రుతుపవనాలు ఆలస్యమైనందున ఖరీఫ్ పంటల కోసం 7 వేల క్యూసెక్కుల నీటిని గోదావరి డెల్టాకు సీలేరు నుంచి విడుదల చేశారు.
గోదావరి డెల్టాకు సీలేరు
రాష్ట్రంలోకి రుతుపవనాల రాక ఆలస్యమైనందున గోదావరికి నీటి తాకిడి లేదు. ఇప్పటి దాకా నదిలో ఉన్న నీటిని ఖరీఫ్ నారుమళ్లకు విడుదల చేశారు. దీని వల్ల ధవళేశ్వరం వద్ద నీటిమట్టం పడిపోయింది. ఇన్‌ఫ్లో నిలిచి పోయి సీలేరు జలాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. గోదావరి డెల్టాలో రబీ కోసం ప్రతి ఏటా సీలేరుపై ఆధారపడడం తప్పనిసరి. అయితే ఖరీఫ్‌కు మాత్రం మొట్టమొదటిసారిగా సీలేరు నుంచి నీరును విడుదల చేస్తున్నారు.