తనతోపాటు పనిలో ఉన్న లారీ క్లీనర్‌ను డ్రైవర్ ఇనుపరాడ్డుతో కొట్టి, కత్తితో పొడిచి అతికిరాతకంగా చంపిన ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. ఏపీలోని కాకినాడకు చెందిన వీరిద్దరూ కరీంనగర్‌కు వచ్చి తిరిగి వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. సినిఫక్కీలో డ్రైవర్ మృతదేహంతో వచ్చి ఖమ్మం జిల్లా కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు నిందితుడు. ఇదంతా చూసిన పోలీసులే విస్మయం చెందారు.
డ్రైవర్ నైఫ్‌రాజు, క్లీనర్ రాజు నూకలలోడు కోసం కరీంనగర్ వచ్చారు. తిరుగు ప్రయాణంలో లారీ లోడుకు పట్టా కట్టే క్రమంలో కొంత వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య ఘర్షణ జరగ్గా డ్రైవర్ నైఫ్‌రాజు క్లీనర్‌ను రాడ్డుతో కొట్టి.. కత్తితో పొడిచాడు. మృతదేహాన్ని లారీలో వేసుకుని కాకినాడకు బయలుదేరాడు.