రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఎన్నికలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. మరోవైపు తుంగభద్ర పుష్కరాల ఘాట్ల వద్ద స్నానాల గదులు నిర్వహించాలని అడిగినందుకు కర్నూలు భాజపా కార్యకర్తలను పోలీసులు గృహ నిర్బంధం చేశారని విమర్శించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
స్థానిక ఎన్నికలకు మరోసారి నోటిఫికేషన్ ఇవ్వాలి: సోము వీర్రాజు
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు మరోసారి నోటిఫికేషన్ విడుదల చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. పాత ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని కోరారు.
somu veerraju