ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో సేవలు ప్రశంసనీయం'

కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో సేవలపై జీజీహెచ్ అభివృద్ధి కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఆసుపత్రిలో అందుతున్న సేవలను.. కలెక్టర్ కార్తికేయ మిశ్రాతో కలిసి కమిటీ బాధ్యులు సందర్శించారు.

'కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో సేవలు ప్రశంసనీయం'

By

Published : May 9, 2019, 9:36 PM IST

'కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో సేవలు ప్రశంసనీయం'
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో పేద ప్రజలకు అందిస్తున్న సేవలను.. జీజీహెచ్ అభివృద్ధి కమిటీ సభ్యులు చాగంటి కోటేశ్వరరావు ప్రశంసించారు. కమిటీ అధ్యక్షుడు బాదం మాధవరావు, కలెక్టర్ కార్తికేయ మిశ్రాతో కలసి ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రతి వార్డులో పరిస్థితి తెలుసుకున్నారు. రోగులకు, వారి బంధువులకు నాణ్యమైన భోజనం అందించడంతోపాటు త్వరగా కోలుకునేందుకు అన్ని చర్యలూ తీసుకోవడం అభినందనీయమన్నారు. ఆస్పత్రిలో 20కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. పనుల ప్రగతిని పరిశీలించేందుకు ఇక నుంచి ప్రతి మూడు నెలలకోసారి కమిటీ పర్యటిస్తుందని తెలిపారు. అంతకు ముందు కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి పనులపై కమిటీ సభ్యులు సమీక్ష నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details