ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చిన్నారులు మలిచిన చిట్టి రోబోలు - proddutur

కడప జిల్లా ప్రొద్దుటూరులోని చిన్నారులతో నిర్వహించిన రోబోటిక్ ఎక్స్‌ఫో 2019 సందర్శకులను అలరించింది. విద్యార్థులు రూపొందించిన పరికరాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

విద్యుత్ పరికరాన్ని చూపుతున్న చిన్నారులు

By

Published : Feb 6, 2019, 6:07 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరులోని చిన్నారులతో నిర్వహించిన రోబోటిక్ ఎక్స్‌ఫో 2019 సందర్శకులను అలరించింది. విద్యార్థుల్లో సృజ‌నాత్మ‌క‌త‌ను పెంచేందుకు, ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే లక్ష్యంతో జీవన జ్యోతి విద్యాసంస్థలు ఈ ప్రదర్శనను స్థానిక గాంధీరోడ్డులోని పాత సుంద‌రాచార్య క్ల‌బ్ ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేశారు. రోబోటిక్ సాయంతో రూపొందించిన వివిధ న‌మూనాల‌ను ప్ర‌ద‌ర్శించి... వాటి పనితీరును సందర్శకులకు వివరించారు. సుమారు 5 వేల మంది విద్యార్థులకు చెన్నైకి చెందిన రోబోటిక్ సంస్ధ‌తో శిక్ష‌ణ ఇప్పించామ‌ని విద్యా సంస్ధ‌ల చైర్మ‌న్ అమ‌ర్‌నాథ్‌రెడ్డి చెప్పారు.

రోబోటిక్ ఎక్స్‌ఫో -2019

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details