Rally against police actions : కడప జిల్లా జమ్మలమడుగు పట్టణ పోలీసులు తమను ఇబ్బంది పెడుతున్నారని.. ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందివారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
Rally against police actions : "పోలీసులు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు" - Rally against police actions in Jammalamadugu
Rally against police actions : కడప జిల్లా జమ్మలమడుగులో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినవారు ర్యాలీ నిర్వహించారు. జమ్మలమడుగు పట్టణ పోలీసులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు.
పోలీసులు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు
అనంతరం అక్కడి నుంచి డీఎస్పీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎస్సీ ఎస్టీలపై దాడులు జరుగుతున్నాయని కేసులు పెట్టేందుకు వెళితే.. తమపైనే రివర్స్ కేసులు పెడుతున్నారని దళిత నాయకులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో శ్రీనివాసులు, డీఎస్పీ నాగరాజుకు వినతి పత్రం అందజేశారు.
ఇదీ చదవండి : Karnataka Liquor seized : కర్ణాటక మద్యం స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్