ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలీసులు దాడులు చేస్తున్నా... ఆగని అక్రమార్కుల ఆగడాలు

అక్రమ రవాణా, మద్యంపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నా... అక్రమార్కుల పంథా మారటం లేదు. అక్రమంగా మద్యం, గంధం చెక్కలను వివిధ ప్రాంతాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

illegal wine and sandal caught by police
అక్రమ మద్యం

By

Published : Dec 29, 2020, 1:03 PM IST

కడప జిల్లాలో..

కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు.. పోలీసు అధికారులు జిల్లాలో పలు చోట్ల దాడులు నిర్వహించారు. 250 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, 0.9 లీటర్ల అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన నిందితుడిపై కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు. లక్కిరెడ్డిపల్లె తనిఖీల్లో 686 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని, నిందితుడిని అరెస్టు చేశారు.

విశాఖలో..

విశాఖ జిల్లా చోడవరంలో గంజాయి పట్టుబడింది. వాహన తనిఖీలు చేస్తుండగా పట్టుపడిన 499 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని, ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

మరో ఘటనలో.. గంధపు చెక్కను కారులో తరలిస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన విశాఖ జిల్లా చోడవరంలో జరిగింది. 150 గంధం చెక్కలు స్వాధీనం చేసుకున్నామనీ... వీటిని కారు డిక్కీలో పెట్టి ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

ఇదీ చదవండి:

మరియమ్మకు అంత్యక్రియలు పూర్తి.. రూ.10 లక్షలు అందించిన హోంమంత్రి

ABOUT THE AUTHOR

...view details