ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Penna Bridge destroyed at Jammalamadugu : మరింత కుంగిన వంతెన.. నిలిచిన రాకపోకలు - మరింత కుంగిన పెన్నా వంతెన

జమ్మలమడుగు సమీపంలోని పెన్నా వంతెన మరింత(Penna bridge)గా కుంగింది. వరద ఉద్ధృతికి బ్రిడ్జి మధ్య భాగం ఒరిగిపోయింది. అప్రమత్తమైన పోలీసులు వంతెనపై రాకపోకలను నిలిపివేశారు.

మరింత కుంగిన వంతెన
మరింత కుంగిన వంతెన

By

Published : Nov 26, 2021, 5:15 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని పెన్నా నదిపై నిర్మించిన వంతెన రోజురోజుకూ కుంగుతోంది. గండికోట, మైలవరం జలాశయాల నుంచి నీరు విడుదల చేస్తుండటంతో.. వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

మరింత కుంగిన వంతెన

వరద తాకిడికి ఈ నెల 22న వంతెన మధ్య భాగం కుంగింది. ప్రయాణికులు గమనించి, పోలీసులకు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అప్రమత్తమై వంతెనపై రాకపోకలు నిలిపివేశారు.

వారం రోజులుగా మైలవరం నుంచి భారీగా వరద వస్తుండటంతో .. బ్రిడ్జి మధ్య భాగం మరింతగా కుంగిపోయింది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు వంతెన వైపు రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బ్రిడ్జి వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీచదవండి.

ABOUT THE AUTHOR

...view details