ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వివేకా హత్య కేసు... కీలక నివేదిక కోర్టు ముందుకు

మాజీ మంత్రి వైఎస్​ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసును ఛేదించడానికి ఆధారాల వేట కొనసాగిస్తున్న పోలీసులు... నలుగురు అనుమానితులకు నార్కో పరీక్షలు పూర్తి చేశారు. దీనికి సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్​లో కోర్టుకు సమర్పించనున్నారు.

వివేకా హత్య కేసు

By

Published : Aug 26, 2019, 7:42 PM IST

కడప జిల్లా పులివెందులకు చెందిన మాజీ మంత్రి వై.ఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సిట్ అధికారులు వేగం పెంచారు. మార్చి 15న జరిగిన వివేకా హత్యను ఛేదించడానికి నలుగురు అనుమానితులకు నార్కో అనాలసిస్ పరీక్షలు పూర్తి చేశారు. 20 రోజుల కిందట గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ ఫోరెన్సిక్ ల్యాబ్​కు నలుగురు అనుమానితులను పోలీసులు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. వీరిలో ఎర్ర గంగిరెడ్డి, వాచ్​మెన్ రంగన్నకు నార్కో పరీక్షలు ముగియటంతో రెండు రోజుల క్రితం పులివెందులకు తీసుకొచ్చారు. మరో ఇద్దరు అనుమానితులు పరమేశ్వర్ రెడ్డి, శేఖర్​ రెడ్డికి కూడా నార్కో పరీక్షలు పూర్తి చేసి ఇవాళ గుజరాత్​ నుంచి పులివెందులకు తీసుకొచ్చారు. వీరిద్దరినీ పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. ఈ నలుగురికి నార్కో అనాలసిస్ పరీక్షలు, బ్రెయిన్ మ్యాఫింగ్, పాలిగ్రాఫ్ పరీక్షలు పూర్తి చేసినట్లు సమాచారం. వీరి నుంచి పోలీసులు స్టేట్​మెంట్ రికార్డు చేసినట్లు తెలుస్తోంది. నార్కో అనాలసిస్‌ నివేదికను సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు సమర్పించనున్నారు. నార్కో పరీక్షల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా హత్య కేసు నిందితులు ఎవరనేది తేల్చే వీలుందని పోలీసు వర్గాలు అంటున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details