ఎంతో మంది అమరవీరుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. 74వ రిపబ్లిక్ డే సందర్భంగా కడప పోలీస్ మైదానంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సీఎం జగన్ హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని మంత్రి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు పరిచారని తెలిపారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్ పాల్గొన్నారు.
ఎంతోమంది అమరవీరుల త్యాగఫలమే స్వాతంత్ర్యం: మంత్రి సురేశ్ - కడపలో జెండా ఎగురవేసిన మంత్రి ఆదిమూలపు సురేశ్ వార్తలు
ఎంతోమంది సమరయోధుల ప్రాణాల త్యాగఫలమే స్వాతంత్ర్యమని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. సీఎం జగన్ హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని తెలిపారు. కడప పోలీసు మైదానంలో జాతీయ జెండాను ఎగురవేశారు.
జెండా ఎగురవేసిన మంత్రి ఆదిమూలపు సురేశ్