ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Kadapa: చక్రాయపేటలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

కడప జిల్లా చక్రాయపేట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రెండు బైక్​లు ఢీ కొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడింది.

Accident
రోడ్డు ప్రమాదం

By

Published : Jul 15, 2021, 11:37 AM IST

రెండు బైక్​లు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఓ చిన్నారి తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కడప జిల్లా చక్రాయపేట వద్ద జరిగింది.

అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం దిగువ పల్లెకు చెందిన ఆవుల వెంకట రమణయ్య, కడపకు చెందిన సురవరం రమణయ్య మరో చిన్నారి నందుతో కలిసి ద్విచక్ర వాహనంలో కడపకు బయలుదేరారు.

అద్దాలమర్రి వంతెన వద్ద వేంపల్లె వైపు నుంచి కదిరికి వస్తున్న మరో ద్విచక్ర వాహనం వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన చిన్నారి నందును స్థానికులు చికిత్స నిమిత్తం వేంపల్లె ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:Kadapa: ప్రొద్దుటూరు పుర‌పాలిక క‌మిష‌న‌రు రాధ బదిలీ ఉత్త‌ర్వుల‌ నిలిపివేత

ABOUT THE AUTHOR

...view details