YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కడప కోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కడప కోర్టు కొట్టేసింది. వారు వేసిన బెయిల్ పిటిషన్లపై వారం క్రితం వాదనలు ముగిశాయి. వాదనలు ముగియడంతో ఇవాళ కడప కోర్టు.. నిర్ణయాన్ని వెల్లడించింది.
YS Viveka Murder Case: వివేకా హత్యకేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్ - వివేకా హత్య కేసు వార్తలు
18:04 December 21
దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్లు డిస్మిస్
మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డికి నార్కో పరీక్షల నిర్వహణకు అనుమతివ్వాలని కోరుతూ ఇవాళ పులివెందుల కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ పిటిషన్‌ను పులివెందుల కోర్టు విచారణకు స్వీకరించింది. నార్కో పరీక్షల కోసం త్వరలోనే శివశంకర్‌రెడ్డి సమ్మతిని కోరనుంది. శివశంకర్ రెడ్డి ప్రస్తుతం కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఇదీ చదవండి
Chandrababu Wishes to CM Jagan: సీఎం జగన్ బర్త్ డే.. చంద్రబాబు ట్వీట్