ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'జిల్లాలో 2 వేల పడకలతో.. కోవిడ్ కేర్ కేంద్రాలు' - covid treatment measures

కడప జిల్లాలోని కోవిడ్​ కేర్​ సెంటర్లను 2 వేల పడకలతో సిద్ధం చేస్తున్నట్టు జిల్లా కోవిడ్ కేర్ సెంటర్ నోడల్ అధికారి యదుభూషణ్ రెడ్డి చెప్పారు. ఆయా కేంద్రాల్లో సిబ్బంది పనితీరు, వాటి ద్వారా రోగులకు అందించే సేవలపై యదుభూషణ్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

covid cre centers nodal officer interview
కోవిడ్​ కేర్​ సెంటర్​ నోడల్​ అధికారి

By

Published : May 4, 2021, 8:20 PM IST

కోవిడ్​ కేర్​ సెంటర్​ నోడల్​ అధికారి యధుభూషణ్ రెడ్డితో ముఖాముఖి..

కడప జిల్లాలోని 5 ప్రాంతాల్లో కోవిడ్ కేర్ కేంద్రాలు ఏర్పాటు చేశామని.. జిల్లా కోవిడ్ కేర్ సెంటర్ నోడల్ అధికారి యదుభూషణ్ రెడ్డి చెప్పారు. 2 వేల పడకలు అందుబాటులోకి తెస్తున్నట్టు వివరించారు. 2 రోజుల్లో బద్వేలులో మరో కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. ఇవన్నీ... మినీ కోవిడ్ ఆసుపత్రులుగా కోవిడ్ కేర్ సెంటర్లు పనిచేస్తాయని చెప్పారు. వీటి ద్వారా బాధితులకు అవసరమైన అన్ని వైద్య సేవలూ అందిస్తున్నట్లు వెల్లడించారు.

రోగుల పరిస్థితి విషమిస్తే కోవిడ్ ఆసుపత్రులకు వెంటనే తరలించేందుకు అంబులెన్సులను సిద్ధంగా ఉంచుతున్నట్లు తెలిపారు. ఈ నెలలో వైరస్​ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున బాధితుల తాకిడి పెరిగే అవకాశం ఉందని.. వాటిని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్న ఆయనతో.. మా ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details