ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అధికారుల నిర్వాకం.. గండికోట జలాల్లోకి దూసుకెళ్లిన బొగ్గు లారీ - కడప అప్​డేట్స్

దారి తప్పి గండికోట జలాల్లోకి బొగ్గు లారీ దూసుకెళ్లిన ఘటన కడప జిల్లా ముద్దనూరు మండలంలో జరిగింది. పోలీసులు వెంటనే స్పందించడంతో డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డారు.

coal-lorry-trapped-in-gandikota-waters
గండికోట జలాల్లోకి దూసుకెళ్లిన బొగ్గు లారీ

By

Published : Nov 23, 2020, 6:49 PM IST

Updated : Nov 23, 2020, 8:12 PM IST

కడప జిల్లా ముద్దనూరు నుంచి తాడిపత్రి వైపునకు బొగ్గు లారీ వెళ్తోంది. ముద్దనూరు మండలం కోడికాండ్ల పల్లె వద్ద ఎడమ వైపు వెళ్లాల్సిన లారీ... పాత రోడ్డు ద్వారా డ్రైవరు వాహనాన్ని పోనిచ్చాడు. గండికోట జలాశయం నీళ్లు రోడ్డును చుట్టుముట్టడంతో నేరుగా జలాల్లోకి లారీ వెళ్ళిపోయింది. డ్రైవరు, క్లీనరు లారీ పైకెక్కి ముద్దనూరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి రోప్ సహాయంతో డ్రైవర్, క్లీనర్​ను రక్షించారు. వివిధ శాఖల మధ్య సమన్వయలోపం కారణంగా ఎటువంటి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

గండికోట జలాల్లోకి దూసుకెళ్లిన బొగ్గు లారీ
Last Updated : Nov 23, 2020, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details