ప్రేమ వ్యవహారంలో.. తల్లీకుమార్తెపై యువకుడి దాడి!
07:50 June 01
గుంటూరు జిల్లాలో దారుణం
గుంటూరు కృష్ణనగర్‌లో దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారంలో.. తల్లి, కుమార్తెపై యువకుడి దాడికి పాల్పడ్డాడు. తల్లి, కుమార్తె గొంతుపై బ్లేడ్‌తో దాడిచేయడంతో.. ఇద్దరికీ స్వల్పగాయాలయ్యాయి. బాధితులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కృష్ణనగర్ పీఎఫ్ కార్యాలయం వద్దనున్న అపార్టుమెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడి అనంతరం అపార్టుమెంట్ రెండో అంతస్థు నుంచి దూకేందుకు యువకుడు యత్నించగా గాయాలయ్యాయి. యువకుడిని పట్టుకున్న స్థానికులు.. పోలీసులకు అప్పగించారు. గాయాలపాలైన యువకుడిని జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా.. ప్రేమ పేరుతో కొంతకాలంగా వేధిస్తున్నాడని, అతని ఫోన్ నంబర్ బ్లాక్ లిస్టులో పెట్టడంతో కక్షగట్టి ఈ దాడికి పాల్పడినట్లు అమ్మాయి తరఫు బంధువులు తెలిపారు.
ఇవీ చవదండి: