Women Attack on Wine Shop: ప్రభుత్వం మద్యనిషేధం హామీని విస్మరించిందని నిరసిస్తూ తెలుగు మహిళలు మంగళగిరిలోని ఓ మద్యం దుకాణాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు. దశలవారీ మద్యనిషేధం అమలు ఎక్కడ అని నినాదాలు చేశారు. మద్యం దుకాణం ఎదుట వంగలపూడి అనిత ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. వైన్ షాప్లో మద్యం సీసాలు కొనుగోలు చేసి దుకాణం బయటే వాటిని పగలకొట్టారు. నకిలీ మద్యంతో ఎంతోమంది మహిళల తాళిబొట్లు తెగుతున్నాయని ఆమె మండిపడ్డారు.
దేశంలో ఎక్కడా లేని నాసిరకం బ్రాండ్లు ఏపీలోనే దొరుకుతున్నాయని ఆరోపించారు. పుట్టినరోజు నాడైనా మద్య నిషేధం హామీని జగన్ రెడ్డి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ సంపాదన కోసమే ఆన్లైన్ పేమెంట్లు వైన్ షాపుల వద్ద పెట్టట్లేదన్నారు. నూతన సంవత్సరం, సంక్రాంతి సీజన్ అమ్మకాలు దృష్టిలో పెట్టుకునే తాత్కాలికంగా మద్యం ధరలు తగ్గించారని ఆమె విమర్శించారు.