క్రిమి సంహారక, ఎరువులు, విత్తన విక్రయ దుకాణాలపై కర్నూలు జిల్లా నంద్యాలలో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మహేశ్వరరెడ్డి, రూపేష్ రొనాల్డ్ మంగళ వారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. పట్టణంలోని దుర్గా, రాయల్, సంజీవ రెడ్డి దుకాణాల్లో తనిఖీలు చేసి.. అనుమతి పత్రాలు లేని రూ.25 లక్షల విలువ చేసే క్రిమి సంహారక మందులు గుర్తించారు. వాటి అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
గుంటూరు పట్నంబజారులోని పలు పురుగులమందుల దుకాణాల్లో విజిలెన్సు, వ్యవసాయ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. కొన్ని దుకాణాల్లో కాలం తీరిన 12 రకాల పురుగులమందుల నిల్వలను గుర్తించారు. వీటి విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని అంచనా. గడువు తీరిన పురుగుమందులను విజిలెన్సు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో సీఐ శ్రీహరిరావుతోపాటు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.