అమరావతి రైతులు 600 రోజులుగా చేస్తున్న పోరాటాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతుల పోరాటానికి తెదేపా సంపూర్ణ మద్ధతుగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రజల కలను జగన్ రెడ్డి చెల్లాచెదురు చేశారని అచ్చెన్న దుయ్యబట్టారు. భవిష్యత్‌ను అంధకారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు. నిండు అసెంబ్లీలో రాజధానిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని జగన్ చెప్పారన్న అచ్చెన్న..రాజధానికి కనీసం 30వేల ఎకరాలు తగ్గకుండా ఉండాలని అన్నారని గుర్తు చేశారు. చర్చి, మసీదు, గుళ్ల నుండి మట్టిని తెచ్చి అమరావతికి శంకుస్థాపన చేస్తే , అవమానించేలా జగన్ వ్యవహరం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పోరాటానికి ప్రతిఫలం దక్కి ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగడం ఖాయమని తేల్చి చెప్పారు.
రైతులదే అంతిమ విజయం..
అమరావతిని అంతం చేసేందుకు వైకాపా నాయకులు గల్లీ నుంచి దిల్లీ వరకూ చేసిన కుట్రలన్నింటిని రైతులు ఓర్పుతో ఛేదించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. బెదిరింపులు, అణిచివేత, అరెస్టులకు అదరం బెదరం అంటూ 600 రోజులుగా జై అమరావతి ఉద్యమంలో భాగస్వామ్యమైన రైతులు, మహిళలు, యువతకు ఉద్యమాభివందనాలు తెలిపారు. అమరావతి పేరు వింటేనే జగన్ రెడ్డి వణికిపోతున్నారని లోకేశ్ దుయ్యబట్టారు. ప్రజారాజధాని పరిరక్షణ ఉద్యమం జగన్ ప్రభుత్వం అణిచివేతకి ఎదురొడ్డి నిలిచి మహోద్యమం అయ్యిందని పునరుద్ఘటించారు. జై అమరావతి పోరాటం 600 రోజులైన సందర్భంగా జేఏసీ పిలుపు మేరకు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ శాంతియుతంగా నిరసన తెలిపిన ఉద్యమకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపాడం తగదని మండిపడ్డారు.
వ్యాన్లలో కుక్కి సెల్ లో బంధించి,రైతుల కాళ్లు విరగ్గొట్టారని లోకేశ్ ఆవేదన వ్యక్తంచేశారు. మహిళల పట్ల మగపోలీసులు అనుచితంగా ప్రవర్తించారని దుయ్యబట్టారు. ఉద్యమంపై ప్రభుత్వ అణచివేత బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు మీడియా ప్రతినిధుల్ని నిర్బందించారని ఆక్షేపించారు. ఖాకీల వలయాన్ని ఛేదించుకుని మంగళగిరి దేవస్థానం చేరుకుని జై అమరావతి అని నినదించడమే నేరంగా జైళ్లలో బందీలైన రైతులు,మహిళలు, టిడిపి నేతలు, ఉద్యమకారుల పోరాటానికి తాను శిరసు వంచి నమస్కరిస్తునన్నారు.
న్యాయమైన రైతుల పోరాటానిదే అంతిమ విజయమని, అమరావతి శాశ్వతమని తెల్చిచెప్పారు. రోడ్లను సైతం తవ్వేస్తూ అమరావతిని చంపేశాం అని జగన్ రెడ్డి ఆనందపడుతున్నారని లోకేశ్ మండిపడ్డారు. వైకాపా తవ్వుకున్న ఆ గుంతల్లోనే వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు పూడ్చిపెట్టబోతున్నారని ఎద్దేవా చేశారు. అవమానాల్ని భరిస్తూనే రాజధాని అమరావతి గొప్పతనాన్ని దేశమంతా తెలిసేలా చేసిన రైతులదే అంతిమ విజయం వరించబోతుందని అభిప్రాయపడ్డారు. ఉద్యమంపై ప్రభుత్వ అణచివేత బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు మీడియా ప్రతినిధుల్ని నిర్బందించారని ఆక్షేపించారు. ఖాకీల వలయాన్ని ఛేదించుకుని మంగళగిరి దేవస్థానం చేరుకుని జై అమరావతి అని నినదించడమే నేరంగా జైళ్లలో బందీలైన రైతులు,మహిళలు, టిడిపి నేతలు, ఉద్యమకారుల పోరాటానికి తాను శిరసు వంచి నమస్కరిస్తునన్నారు. న్యాయమైన రైతుల పోరాటానిదే అంతిమ విజయమని, అమరావతి శాశ్వతమని తెల్చిచెప్పారు.
నాడు అమరావతిని జగన్ స్వాగతించ లేదా...