తెదేపా రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం - KALAVENKATARAO
మహానుభావుల త్యాగ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ అన్నారు. గుంటూరు తెదేపా కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
గుంటూరు తెదేపా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో 73 వ స్వాతంత్య్ర దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను, పార్టీ జెండాను రాష్ట్ర అధ్యక్షడు కళా వెంకటరావు ఆవిష్కరించారు. ఎందరో మహానుభావుల త్యాగఫలితమే నేడు జరుపుకుంటున్న స్వాతంత్య్ర దినోత్సవమని కళా గుర్తుచేశారు. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నవారు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషిచేయాలని సూచించారు. 5 సంవత్సరాల్లో రాష్టానికి దశా.. దిశా నిర్దేశం చేసిన నాయకుడు నారా చంద్రబాబు అని నేతలు కొనియాడారు. తెలగు ప్రజలకు ...తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వివరించారు.
కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు, ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్సీలు దొక్కమాణిక్యవరప్రసాద్, కె.ఎస్. రామకృష్ణ, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.