ఆరోగ్యశాఖ అధికారి మొబైల్కు కరోనా వ్యాక్సినేషన్ రెండు డోసులు విజయవంతంగా వేయించుకున్నారంటూ సంక్షిప్త సందేశం వచ్చింది. అందులో వింతేముంది వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న అందరికీ వస్తుంది అంటారా..అదే మరి ఇక్కడ ట్విస్టు..
ఆయన వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించిన తొలిరోజుల్లోనే రెండు డోసులు వేయించుకున్నారు. అంతేనా స్వయానా ఆయనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ అధికారి. ఆయనకు గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఇలా వింత అనుభవం ఎదురైంది.