భారత్-చైనా సరిహద్దుల్లో అశువులు బాసిన అమరవీరులకు కాంగ్రెస్ పార్టీ నాయుకులు ఘన నివాళులు అర్పించారు. గుంటూరు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జవాన్లకు నివాళి అర్పిస్తూ మౌనం పాటించారు. కరోనా వంటి జాతీయ విపత్కర పరిస్థితుల్లో చైనా హద్దు మీరి భారత్‌పై దాడికి పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు అన్నారు.
అమర వీరులకు ఘన నివాళులు - latest news on jawans death
దేశం కోసం కొనసాగిన పోరాటంలో వీర మరణం పొందిన భారత జవాన్ల ఆత్మలకు శాంతి చేకూరాలని గుంటూరులో కాంగ్రెస్ పార్టీ నాయుకులు ఘన నివాళులు అర్పించారు. దాడిలో ప్రాణాలు అర్పించిన జవాన్ల కుటుంబాలుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.
అమర వీరులకు ఘన నివాళులు
ఈక్రమంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల కుటుంబాలుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. చైనా-భారత్ మధ్య జరిగిన చర్యల సారాంశాన్ని ప్రజలకు తెలియచేయకుండా ప్రధాని మోదీ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాడులను ధైర్యంగా ఎదురుకొన్నామని అన్నారు. చైనా వస్తువులను బహిష్కరించాలని పశ్చిమ సమన్వయకర్త సవరం రోహిత్ అన్నారు.