ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ జాతి పశువులను అభివృద్ధి చేయడమే లక్ష్యం: మంత్రి అప్పలరాజు - మిషన్ పుంగనూరు' కార్యక్రమం ప్రారంభం

గుంటూరు జిల్లా లాం ఫాంలో మిషన్ పుంగనూరు కార్యక్రమాన్ని పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ సీదిరి అప్పలరాజు ప్రారంభించారు. అంతరించుపోతున్న పుంగనూరు జాతి పశువులను అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.

mission punganur
మిషన్ పుంగనూరు

By

Published : Sep 7, 2021, 4:36 PM IST

పుంగనూరు జాతి పశువులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా 'మిషన్ పుంగనూరు'(Mission Punganoor) కార్యక్రమం చేపట్టినట్లు పాడిపరిశ్రమాభివృద్ధిశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు (minister Seediri Appalaraju) తెలిపారు. గుంటూరు జిల్లా-లాం ఫాంలోని పశు పరిశోధనా కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం అధికారులతో కలిసి మిషన్ పుంగనూరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రూ. 69 కోట్ల కేటాయించినట్లు మంత్రి తెలిపారు.

నేడు అంతరించుపోతున్న పుంగనూరు జాతిని పరిరక్షించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు వివరించారు. లాం ఫాంలోని పరిశోధన కేంద్రంలో ఆధునిక వసతులు ఉన్నాయని... గతంలో ఒంగోలు జాతి పశువుల రక్షణ ఈ కేంద్రం ఎంతగానో కృషి చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు పుంగనూరు జాతి విషయంలో కూడా అదే కృషి జరపనుందని విశ్వాసం వ్యక్తంచేశారు.

ABOUT THE AUTHOR

...view details