పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రకటన సందర్భంగా కొన్ని చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్లలో సర్పంచి అభ్యర్థి కుసుమ రాజు వీరమ్మ 20 ఓట్ల తేడాతో గెలుపొందగా.. మళ్లీ రీకౌంటింగ్ పెట్టాలని ప్రత్యర్థులు ఆందోళన చేశారు.
ఎన్నికల ఫలితాల దృష్ట్యా పలు చోట్ల ఉద్రిక్తతలు విజయవాడలో నున్న 14 వవార్డు టై అవ్వటంతో లాటరీ పద్ధతిలో గెలుపు ఖరారు చేయగా.. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారని.. దీనిపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేస్తామంటూ ఓడిన అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు.
గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరులో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. మొదటిసారి లెక్కింపులో అశోక్ కుమార్‌కు 18 ఓట్ల మెజారిటీతో గెలవగా.. రెండోసారి లెక్కింపులో ఆరు ఓట్లు తగ్గి 12 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. అయితే మరోసారి లెక్కించాలని ప్రత్యర్థులు ఆందోళనకు దిగారు. కృష్ణా జిల్లా మైలవరం మండలం పొందుగలలో 7 ఓట్ల తేడాతో అభ్యర్థి గెలుపొందగా.. రీ కౌంటింగ్‌లోనూ అతనే గెలవడంపై.. ప్రత్యర్థులు నిరసన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:తెలంగాణలో రాజన్న రాజ్యం మళ్లీ తీసుకొస్తా: వైఎస్ షర్మిల