రాష్ట్రంలో మిగతా మున్సిపాలిటీలకు మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు ఉపసభాపతి కోన రఘుపతి. బాపట్లతోపాటు రాష్ట్రంలో 19 పురపాలికల్లో ఎన్నికలు విలీన గ్రామాల సమస్యతో ఆగిపోయాయని చెప్పారు. అవన్నీ కూడా పరిష్కారమై త్వరలో ఎన్నికలు జరుగుతాయన్నారు.
బాపట్లలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైకాపా విజయం తథ్యమని విశ్వాసం వెలిబుచ్చారు. రాష్ట్రమంతా అదే ఒరవడి కొనసాగుతుందన్నారు. బాపట్లలో వైద్యకళాశాల నిర్మాణం కోసం రూ.475 కోట్ల పరిపాలనా అనుమతులు వచ్చినట్లు తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.