ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని సీఎం జగన్​కు కన్నా లేఖ

రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. సీఎం జగన్ కు లేఖ రాశారు. సెప్టెంబర్ నుంచి వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే రేషన్ సరకులు పంపించే ఏర్పాట్లపై.. డీలర్లు ఆందోళన చెందుతున్నారని లేఖలో పేర్కొన్నారు. అలా చేస్తే రేషన్ డీలర్లు ఉపాధి కోల్పోతారన్నారు. రేషన్ సరకుల పంపిణీకి ప్రభుత్వం ఇచ్చే కమీషన్ ఆధారంగా డీలర్లు జీవిస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. లాక్​డౌన్ సమయంలో ఇచ్చిన ఏడు విడతల రేషన్ పంపిణీలో...మిగిలిన ఐదు విడతల కమీషన్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

కన్నా లక్ష్మీనారాయణ
కన్నా లక్ష్మీనారాయణ

By

Published : Jul 25, 2020, 2:51 PM IST

కన్నా లక్ష్మీనారాయణ లేఖ

రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్ కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వారి ఉపాధికి గండి పడకుండా చూడాలని లేఖలో డిమాండ్ చేశారు. డీలర్లలో ఎక్కువమంది ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలవారే ఉన్నారని... స్వయం ఉపాధి కింద వారంతా రేషన్ సరకుల పంపిణీ బాధ్యతలు చేపడుతున్నారని వివరించారు. ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సరకులు ఇంటికి పంపిస్తే... డీలర్లకు వచ్చే కమీషన్ కోల్పోతారని లేఖలో పేర్కొన్నారు.

కరోనా సమయంలో ఏడు విడతల రేషన్ పంపిణీ చేయగా.. కేవలం 2 విడతల కమీషన్ ఇవ్వటాన్ని కన్నా తప్పుబట్టారు. మిగతా ఐదు విడతల కమీషన్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ డీలర్లందరికీ కరోనా బీమా సౌకర్యం కల్పించాలన్నారు. బయోమెట్రిక్ విధానం రద్దు చేసి డీలర్లను కరోనా బారి నుంచి కాపాడాలని కోరారు. రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు మాధవరావు తనకు ఇచ్చిన లేఖను... ముఖ్యమంత్రికి రాసిన లేఖతో పాటు జత చేశారు.

ఇదీ చదవండి :'నలంద కిషోర్​ను క్షోభ పెట్టి ప్రభుత్వమే చంపేసింది'

ABOUT THE AUTHOR

...view details