కృష్ణా జలాల వ్యవహారంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వైఖరిపై అనుమానాలున్నాయని జనసేన రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (nadhendla manohar) అన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (pawan kalyan) అధ్యక్షతన జరిగే సమావేశంలో ఓ నిర్ణయానికి వస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను ముఖ్యమంత్రి మోసం చేశారని ఆరోపించారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు అవస్థలు పడుతున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన జనసేన ప్రజాప్రతినిధులకు అధికారులు.. ప్రాధాన్యం ఇవ్వడంలేదన్న అంశంపై ఆందోళనలు చేస్తామని వెల్లడించారు.
AP - TS Water Disputes: 'ఇరు రాష్ట్రాల సీఎంల వైఖరిపై అనుమానాలున్నాయి'
కృష్ణా జలాల వివాదం(krishna water dispute)పై ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై అనుమానాలున్నాయని జనసేన నేత నాదెండ్ల మనోహర్(nadhendla manohar) అన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్(pawan kalyan) ఆధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
జనసేన రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్