గుంటూరు జిల్లాలో భారీగా అక్రమ మద్యం పట్టుకున్నారు. పలకలూరు, కారుమంచి గ్రామాల్లో మద్యం స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, గోవా నుంచి తరలిస్తున్న 4,764 సీసాల అక్రమ మద్యం స్వాధీనం పట్టుకున్నారు. పట్టుకున్న మద్యం విలువ రూ.13.58 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, ఎస్ఈబీ ఏఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
గుంటూరు జిల్లాలో భారీగా అక్రమ మద్యం పట్టివేత - Guntur District latest news
గుంటూరు జిల్లా పలకలూరు, కారుమంచి గ్రామాల్లో పోలీసులు భారీగా అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేశామని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.
గుంటూరు జిల్లాలో భారీగా అక్రమ మద్యం పట్టివేత
నలుగురు నిందితులను అరెస్టు చేశామని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. గ్రానైట్ లారీల ద్వారా మద్యం తరలిస్తున్నట్లు గుర్తించామని వివరించారు. ప్రధాన నిందితుడు శ్రీనివాసరావుపై పీడీ చట్టం ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. అక్రమ మద్యం, ఇసుకపై ప్రభుత్వం సీరియస్గా ఉందని.. ప్రజలు అక్రమ మద్యంపై సమాచారం ఇవ్వాలని అమ్మిరెడ్డి కోరారు.
ఇదీ చదవండీ...'సురక్ష ఏపీ'గా తీర్చిదిద్దుతాం: సోము వీర్రాజు